ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు. మానకొండూరు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కరోనా కారణంగా.. ఈ ఏడాది ఇఫ్తార్ విందు జరుపుకోలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మినీ పురపోరుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు