కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హరితహారం కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో మొక్కలు నాటడం నియోజకవర్గంలో ఆలస్యమైనా.. ఇప్పటినుంచి మొక్కలు అధిక సంఖ్యలో నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నాగుల పంచమి: కరీంనగర్‌లో భక్తుల ప్రత్యేక పూజలు