కరీంనగర్ పట్టణంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆరో విడత హరితహారంలో భాగంగా దిగువ మానేరు జలాశయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం శాతవాహన వర్సిటీలో మిషన్ భగీరథ పథకం కింద రూ.110 కోట్లతో నూతనంగా నిర్మించిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రారంభించారు.
నగర ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. కేవలం రెండు సంవత్సరాలలోనే జలాశయం పనులు పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్‌రావు, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.