ETV Bharat / state

Koppula eshwar on Etela: 'ఏడేళ్ల కాలంలో భాజపా ఏం చేసింది?'

ఏడేళ్ల కాలంలో భాజపా ఏం చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలను అమాంతం పెంచిందని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపాపై విమర్శలు(Koppula eshwar on etela) గుప్పించారు. ఇక్కడ వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యమని ఆయన అన్నారు.

Koppula eswar on etela, huzurabad by election
భాజపాపై కొప్పుల ఈశ్వర్ విమర్శలు, హుజూరాబాద్ ఉపఎన్నికలు
author img

By

Published : Oct 11, 2021, 11:35 AM IST

Updated : Oct 11, 2021, 12:31 PM IST

ఏడేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar on bjp) విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరను అమాంతగా పెంచిందని ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని ఆగ్రహం(Koppula eshwar on etela) వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ తరఫున జమ్మికుంటలో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఈటలపై తీవ్ర స్థాయిలో విమర్శలు(Koppula eshwar on etela rajender) గుప్పించారు. 'ఇక్కడ వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యమని' మంత్రి అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దు ఎవరికి ఉపయోగపడిందని? నల్లధనం ఏమైందని మంత్రి ప్రశ్నించారు. భాజపాలో చేరి ఏం చేస్తారని ఈటల రాజేందర్​ను ప్రశ్నించారు. కనీసం సర్పంచ్ పదవిలోలేని రాజేందర్​కు ఎమ్మెల్యే టికెట్... ఆ తర్వాత మంత్రి పదవినీ సీఎం కేసీఆర్(CM KCR) కట్టబెట్టారని అన్నారు. ఆ పదవులతో పాటు మెడికల్ కళాశాలకు అవకాశం ఇస్తే... ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని కాంక్షిస్తూ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

భాజపా ఏడు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేసింది? ఏం చేయబోతుంది రేపు. ఇవాళ గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర, నిత్యావసరాల సరుకుల ధరలు పెంచింది. కష్టపడి సాధించుకున్న 24 గంటల కరెంటును ప్రైవేటుపరం చేయబోతున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు. రేపు కల్లాలు ఎత్తేసి.. రైతుల నోట్లో మట్టి కొట్టబోతున్నారు. రెండుసార్లు మంత్రిగా ఉన్న ఈటల... ఇప్పుడు రోడ్లు, రహదారులు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎవరికి ఉపయోగపడ్డది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన్రా? నల్లధనం ఏమైంది?. భాజపా వాళ్లకు ఎజెండా లేదు. ఇక్కడ వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యం. దయచేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కే ఓటు వేసి గెలిపించండి.

-కొప్పుల ఈశ్వర్, సంక్షేమశాఖ మంత్రి

భాజపాపై కొప్పుల ఈశ్వర్ విమర్శలు

ఇదిలా ఉండగా హుజూరాబాద్ ఓటర్ నాడీ తెలుసుకునేందుకు నిరంతర సర్వేలు కొనసాగుతున్నాయి. గ్రామాల వారీగా, వార్డుల వారీగా, ఓటర్ల వారీగా.. ఇలా ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్ని కోణాల్లోనూ సర్వేలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో(TRS Strategy in Huzurabad By Election 2021) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార తెరాస ప్రభావం ఎంత మేరకు పెరిగింది. ప్రత్యర్థి ఓటమి ఖాయం అయిందా లేదా అన్న అంశంపై అన్ని కోణాల్లో ఆరా తీయిస్తున్నారు. ఓ వైపున నిఘా వర్గాలు, మరో వైపున సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు ఇలా అవకాశం ఉన్న ప్రతి ఏజెన్సీతో గ్రౌండ్ రియాల్టీపై విశ్లేషిస్తున్నారు. మరో వైపు ఎక్కడెక్కడ లోపాలున్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2021, 12:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.