కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్దులు ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. జమ్మికుంట, వీణవంక మండలాల్లో చేనేత కార్మికుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యతో కలిసి హాజరయ్యారు.
పథకాలు రద్దు చేసిన భాజపా వైపా లేక పద్దులు ఇచ్చిన తెరాస వైపు ఉంటారా అనేది ప్రజలు ఆలోచించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.
ఎవరి వైపు ఉంటారో..
"త్రిఫ్ట్ పథకం కింద రూ.30 కోట్లు విడుదల చేసినం. మీ శక్తిమేరకు త్రిఫ్ట్ పథకంలో భాగస్వాములు కావచ్చు. అందుకోసం నిధుల కొరత లేదు. బొట్టు బిళ్లలు, కుట్టు మిషన్లకు ఓట్లేస్తారా.. కడుపు నిండా అన్నం పెట్టి, జీవితాల్లో వెలుగులు నింపే తెరాసకు ఓట్లేస్తారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి రెండు పడక గదులు మంజూరు చేస్తే... మంత్రిగా ఉండి కూడా ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదు. మాట్లాడితే ఆత్మగౌరవం అంటుండు. నాలుగు వేళ ఇండ్లు కట్టించి... గృహప్రవేశం చేపిస్తే అది ఆత్మగౌరవం. మొసలి కన్నీరు కార్చుతూ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు. ఎవరి వైపు ఉంటారో.. మీరే ఆలోచించుకోవాలి. అసలు మన రాష్ట్రానికి భాజపా ఏం చేసిందని ఓట్లడుగుతున్నారు." - హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చూడండి: