ETV Bharat / state

HARISH RAO: 'మాటలు చెప్పేవాళ్లం కాదు.. పనిచేసే వాళ్లం' - minister gangula kamalakar news

తాము మాటలు చెప్పే వాళ్లం కాదని.. పని చేసేవాళ్లమని మంత్రి హరీశ్​ రావు అన్నారు. కరీంనగర్​ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్​ రావు, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ పాల్గొన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలని మంత్రి హరీశ్​ రావు ప్రజలకు సూచించారు.

HARISH RAO: మాటలు చెప్పేవాళ్లం కాదు.. పనిచేసే వాళ్లం: హరీశ్​ రావు

author img

By

Published : Aug 11, 2021, 5:57 PM IST

Updated : Aug 11, 2021, 6:40 PM IST

తన నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదని... వీణవంక మండలంలోని రెండు గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. రూ.4 కోట్లతో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణాలను 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తాము మాటలు చెప్పే వాళ్లం కాదని.. పని చేసేవాళ్లమని ఆయన వెల్లడించారు. కరీంనగర్​ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్​ రావు, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ పాల్గొన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటి అయింది..

ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలని మంత్రి హరీశ్​ సూచించారు. ఒకప్పుడు కరెంట్​ ఉంటే వార్త అని.. ఇప్పుడు కరెంట్​ లేకపోతే వార్త అని ఆయన అన్నారు. పల్లెటూళ్లలోనే కాదు వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. తెలంగాణ వస్తే మీ బతుకు చీకటి అవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటి అయిందని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడ్డ ఏడాదిలో సీఎం కేసీఆర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చారని మంత్రి హరీశ్​ కొనియాడారు.

ఈటల కల్యాణలక్ష్మి దండుగ అంటున్నారు..

గత పాలకుల హయాంలో నీళ్లు లేక రైతులు అరిగోస పడ్డారని.. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయని మంత్రి అన్నారు. రైతుబంధు ద్వారా రెండు పంటలకు ఎకరాకు 5 వేల రూపాయలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధర పెంచడంతో దున్నే కూలీ పెరిగిందని ఆరోపించారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నామని.. ఈటల రాజేందర్ కల్యాణలక్ష్మి దండగ అంటున్నారని ఆరోపించారు. పింఛన్లను రూ. 2016కి పెంచామన్న మంత్రి.. అభయహస్తం డబ్బులు కట్టిన వాళ్లకు వడ్డీతో సహా ఇచ్చి.. రూ.2 వేల పింఛన్​ మంజూరు చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ ప్రతి మంత్రికి 4 వేల ఇళ్లు ఇచ్చారని.. హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇంకా ఈ నియోజకవర్గంలో 4 వేల ఇల్లు పెండింగులో ఉన్నాయని... మరి ఎందుకు చేయలేదో అందరూ ఆలోచించాలని మంత్రి హరీశ్​ ప్రజలకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న 4 వేల ఇళ్లను కట్టించే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. వాటితో పాటు కూలిపోయిన, శిథిలావస్థలో ఉన్న వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు. నెరవేర్చని హామీలను తెరాస ఎప్పుడూ ఇవ్వలేదని మంత్రి హరీశ్​ స్పష్టం చేశారు.

మరో 60 వేల ఉద్యోగాలు..

రైతు రుణ మాఫీ రూ.50 వేల లోపు ఉన్న వాళ్లకు ఆగస్టు 15న వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నాం. రూ.50 వేల నుంచి లక్ష లోపు అప్పు ఉన్న వాళ్లకు కూడా అతి త్వరలోనే వేస్తాం. కేంద్రంలోని భాజపా సర్కారే ఉద్యోగాలు ఊడగొడుతోంది. ఇప్పటివరకు లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 60 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాంఉద్యోగాలు ఎవరు ఊడగొట్టారో.. ఎవరు ఇచ్చారో ప్రజలే ఆలోచించుకోవాలి. ఆహార ఉత్పత్తి పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక రంగాల్లో తెలంగాణ ఏడేళ్లలో నెంబర్ వన్​గా నిలిచింది. ఒక్క నెలలో జమ్మికుంట రోడ్డు పూర్తి చేస్తాం. -హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

HARISH RAO: 'మాటలు చెప్పేవాళ్లం కాదు.. పనిచేసే వాళ్లం'

మహిళల గురించి ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తోంది..

తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలతో పాటు మహిళలు అభివృద్ధి చెందారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. రాష్ట్రంలో లక్ష మంది ఒంటరి మహిళలకు పింఛన్​ ఇస్తున్నామన్నారు. ఆడవాళ్ల గురించి ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తోందన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించడం.. కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల సహజ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్​ను ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల సూచించారు.

24గంటల విద్యుత్​ అందిస్తున్నాం..

తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ ప్రజలకు సూచించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా అని ఆలోచించాలని మంత్రి గంగుల సూచించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Harish rao: 'ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేస్తే... మోసం చేశాడు'

Last Updated : Aug 11, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.