ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జ్యోతినగర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. మొదటి ఆలయానికి వెళ్లిన మంత్రికి స్థానిక కార్పొరేటర్ గందె మాధవి ఘనస్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగరపాలకసంస్థ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.