కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఉచిత భియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 17వేల రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా కార్డుల పరిధిలోని 53 లక్షల మందికి మే, జూన్ కోసం కేంద్రం ఉచితంగా 10 కిలోల బియ్యం అందిస్తోందని మంత్రి చెప్పారు. ఆ బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి మొత్తం 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నట్లు గంగుల పేర్కొన్నారు.
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 లక్షల కార్డుల్లోని లబ్ధిదారులకు మొత్తంగా ఈనెల 15 కిలోలు, వచ్చే నెల 5 కిలోల ఉచిత బియ్యం అందించడం ద్వారా దాదాపు 2 కోట్ల 80 లక్షల మందికి 4 లక్షల 31 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకోసం దాదాపు 92 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ కష్టకాలంలో పేదల కడుపునింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా