ETV Bharat / state

రేషన్ కార్డు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి: మంత్రి గంగుల - తెలంగాణ వార్తలు

రేషన్ కార్డుల కోసం పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను పంపించాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్​లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు.

minister gangula kamalakar, ration cards
మంత్రి గంగుల కమలాకర్, కొత్త రేషన్ కార్డులు
author img

By

Published : Jun 18, 2021, 1:40 PM IST

రేష‌న్ కార్డుల జారీపై స‌బ్ క‌మిటీ సూచించిన విధంగా పెండిగ్​లో ఉన్న అప్లికేష‌న్ల‌ను త్వ‌రగా పరిశీలించి స్ప‌ష్ట‌మైన నివేదికను వారం రోజుల్లో త‌యారు చేయాల‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల జారీ, ధాన్యం సేక‌ర‌ణ అంశాల‌పై క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ అధికారులు, డీఎస్వోల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ఎన్ఐసీ, ఐటీ డిపార్ట్​మెంట్ పరిశీలనలో మిగిలిన 4,15,901 కార్డుల‌కు సంబంధించి 11,67,827 మంది ల‌బ్ధిదారుల వివ‌రాల‌పై క్షేత్ర స్థాయిలో త‌నిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రక్రియ వేగవంతం

అత్య‌ధికంగా ద‌ర‌ఖాస్తులు ఉన్న హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి జిల్లాల్లో మున్సిప‌ల్ శాఖ‌, జీహెచ్ఎంసీతో స‌మ‌న్వ‌యం చేసుకొని త్వ‌రగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అర్హుల‌ను గుర్తించి రేష‌న్ కార్డు అందించే విధంగా చ‌ర్య‌లు చేపట్టాలని చెప్పారు. రాష్ట్రంలోని రేష‌న్ కార్డుల‌కు త్వ‌ర‌లోనే స్మార్ట్ కార్డును జారీచేయాల‌ని ప్ర‌భుత్వం పరిశీలిస్తోందని తెలియ‌జేశారు. రేష‌న్ డీల‌ర్ల స‌మ‌స్య‌లు, నూత‌న రేష‌న్ షాపుల ఏర్పాటు గురించి అధికారుల‌తో చ‌ర్చించారు.

అతి త్వరలో జాబితా

రేష‌న్ కార్డులు ఇవ్వ‌డం కోసం ప్రభుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంద‌ని ఉన్నతాధికారులు వెల్లడించారు. 4,97,389 దరఖాస్తులను ద‌శ‌ల వారిగీ పరిశీలించామని... అతి త్వ‌ర‌లో అర్హుల జాబితాల‌ను పంపించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల‌లో రాష్ట్రం స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించింద‌ని, దేశంలోనే అత్య‌ధికంగా ఈ యాసంగిలో 90కోట్ల మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేక‌రించ‌డంలో స‌హ‌క‌రించిన క‌లెక్ట‌ర్లు, అదన‌పు క‌లెక్ట‌ర్లు, పౌర‌స‌ర‌ఫ‌రాల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, స‌హ‌కార సొసైటీల‌ు, మ‌హిళా సంఘాలు, కూలీలు, హ‌మాలీల‌కు మంత్రి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, పౌర‌స‌ర‌ఫ‌రాల, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: WTC Final: తొలి రోజు వర్షార్పణమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.