ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పార్క్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్ హస్నాపూర్లో పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి, మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేశారు.
కరీంనగర్ నగర ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కాలనీలలో సేద తీరేందుకు పార్క్ నిర్మాణం చేపట్టామన్నారు. కాలనీలో సమస్యలు పరిష్కరించాలని మహిళలు మంత్రి గంగుల ముందు ఎకరవు పెట్టుకున్నారు. స్పందించిన మంత్రి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: డిసెంబర్ ప్రథమార్థంలో పెరిగిన విద్యుత్తు వాడకం