ETV Bharat / state

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమే: మంత్రి గంగుల కమలాకర్​ - telangana news

Minister Gangula Kamalakar: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో గంగుల కమలాకర్‌తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ పాల్గొన్నారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని వినోద్‌ కుమార్‌ సూచించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమే: మంత్రి గంగుల కమలాకర్​

author img

By

Published : May 29, 2022, 2:58 PM IST

Updated : May 29, 2022, 3:12 PM IST

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమే: మంత్రి గంగుల కమలాకర్​

Minister Gangula Kamalakar: మండు వేసవిలో కూడా నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. తెలంగాణ రాక ముందు కరీంనగర్​లో తాగునీరు, సాగునీటికి అరిగోస పడేవాళ్లని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్​ ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్​నగర్​లో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్​తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ పాల్గొన్నారు. ఆసిఫ్​నగర్​లోని పలువురు భాజపా కార్యకర్తలు ఈ సందర్భంగా తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

"తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత పరిస్థితి ఏమిటో మీరే చూశారు. ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. తాగునీరు, సాగునీటికి అరిగోస పడ్డాం. ప్రజలకు ఏమి కావాలి అని ఆనాడు ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. గ్రామాలు ఆర్ధికంగా ఎదగాలని తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మండుటెండలో నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కరెంట్ కావాలని ఆనాడు నేనే స్వయంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తే మాపై కేసులు నమోదు చేశారు. మన ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ తెరాస మాత్రమే. త్వరలోనే గ్రామ గ్రామాన తిరుగుతా.. మీ అందరి వద్దకు వస్తా." -గంగుల కమలాకర్​, మంత్రి

అన్ని ప్రైవేట్​పరం చేస్తున్నారు: ధనికుల కోసమే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ ఆరోపించారు. అన్ని ప్రైవేట్​పరం చేసి అంబానీ, అదానీలకు ఇస్తున్నారని.. భవిష్యత్‌లో అంబాని ఎక్స్‌ప్రెస్‌, అదాని ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంటాయని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎవరి మతం వారిది ఎవరి విశ్వాసం వారిదన్న వినోద్​ కుమార్​.. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు.

"ఎవరి మత విశ్వాసం వారిది, పరస్పరం గౌరవించుకోవాలి. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. భాజపా ఎంపీలు, కేంద్రమంత్రులకు సవాల్ విసురుతున్నా. భాజపా పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? నిజమైన దేశ భక్తులు ఇక్కడి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. ధనికుల కోసమే భాజపా ప్రభుత్వం పని చేస్తోంది. అన్నీ ప్రైవేట్‌పరం చేసి..అంబానీ, అదానీలకు ఇస్తున్నారు. భవిష్యత్‌లో అంబాని ఎక్స్‌ప్రెస్‌, అదాని ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంటాయి." -బోయినపల్లి వినోద్​కుమార్​, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : May 29, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.