కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి బొమ్మకల్‌లోని మొదటి చెక్ డ్యాం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పరిధిలో రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.310 కోట్లు మంజూరు చేశారన్నారు. మానేరు తీరంలో కొనసాగుతున్న కేబుల్ బ్రిడ్జీ పనులను జిల్లా కలెక్టర్, నగరపాలక మేయర్‌తో కలిసి పరిశీలించారు.
ప్రతిపక్షాల విమర్శలకు తాము చేసే అభివృద్ధితోనే సమాధానం చెబుతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్ జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకుపోతున్నామని చెప్పారు. రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన భూసేకరణకు సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయిన తర్వాత డీపీఆర్ టెండర్లను పిలుస్తామన్నారు.
ఇదీ చదవండి: తీవ్ర ఇన్ఫెక్షన్కూ భారతీయ టీకాలు చెక్!