కరీంనగర్‌లోని శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నగరంలో చేపట్టే నిర్మాణాలకు నగరపాలక సంస్థ ద్వారా... శివారులోని 71 గ్రామాల్లో నిర్మాణాలకు సుడా ద్వారా అనుమతులు పొందాలని గంగుల సూచించారు. భవిష్యత్ అవసరాలు, రహదారులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సుడా ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మెన్ జీవీ రామకృష్ణ వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గంగులపై నమోదైన ఎన్నికల నియమావళి కేసు కొట్టివేత