కరీంనగర్ అశోక్‌నగర్‌లోని శ్రీవాసవి మాతా ఆలయంలో శ్రీ సేవా మార్గ్ సంస్థ ఆధ్వర్యంలో 100 మంది నాయిబ్రాహ్మణులకు మంత్రి గంగుల కమలాకర్ ఫేస్‌షీల్డులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తున్న ఈ సమయంలో ప్రతీ ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా సెలూన్లలో పని చేసే వ్యక్తులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.
శ్రీ సేవా మార్గ్ సంస్థ ద్వారా ముఖం మొత్తం కవర్ చేసేలా ప్రత్యేకంగా తయారు చేసిన ఫేస్ షీల్డ్ మాస్కుల వల్ల నాయిబ్రాహ్మణులతో పాటు వినియోగదారులకు కూడా రక్షణ చేకూరుతుందన్నారు. ఇలాంటి మాస్కులను సంస్థ ప్రత్యేకంగా తయారు చేసి పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ప్రశంసించారు.
ఇవీ చూడండి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి