ETV Bharat / state

తెలంగాణ సంపదపై వాళ్లంతా కన్నేశారు: మంత్రి గంగుల - తెలంగాణ సంపదపై కొందరు కన్నేశారు

Minister Gangula Comments on CBN : తెలంగాణ సంపదపై కొందరు కన్నేశారని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. తిరుగుబాటు మొదలు పెట్టకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు.

Minister Gangula Comments on CBN
Minister Gangula Comments on CBN
author img

By

Published : Dec 22, 2022, 5:26 PM IST

Minister Gangula Comments on CBN: తెలంగాణ రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కోవాలని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. తిరుగుబాటు మొదలు పెట్టకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో గంగుల ఈ మేరకు మాట్లాడారు. ‘‘తెలంగాణ సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంపద పెరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల వెరైటీ ముసుగుతో ఇక్కడికొచ్చారు. కేఏ పాల్, పవన్‌కల్యాణ్‌ కూడా వచ్చారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ప్రవేశించారు. తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారు. డిఫరెంట్‌ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాడు ముక్కలు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి అజెండా. ఏపీ మూలాలున్న మీకు.. తెలంగాణ గడ్డపై ఏం పని? వీళ్లందరి వెనుకా భాజపా ఉంది.

హైదరాబాద్‌ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. షర్మిలతో పాటు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ భాజపా బాణాలే. భారాసతో మేం దేశమంతా వెళ్తుంటే.. తెలంగాణపైకి వీళ్లంతా ఎందుకొస్తున్నారు? ఏనాడూ మేం ఏపీ సంపద దోచుకోవాలనుకోలేదు.. అందుకే అక్కడ పక్కాగా పోటీ చేస్తాం. గతంలో తెలంగాణను దోచుకున్న వాళ్లు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాళ్లు కూడా మిమ్మల్ని నమ్మరు’’ అని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.