ధరణి వెబ్‌సైట్‌లో నమోదు కాని ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఒక ఎంపీటీసీ ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న నిర్మాణాలను 58, 59 జీవోల ప్రకారం తాము క్రమబద్ధీకరించుకోలేదని సందేహాన్ని లేవనెత్తగా.. విధిగా ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని సమాధానం చెప్పానని మంత్రి స్పష్టతనిచ్చారు.
ప్రభుత్వ భూముల గురించి తాను సందేహాన్ని నివృత్తి చేస్తే.. ప్రైవేటు భూములను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పినట్లు తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: భూ వివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు