కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ, పాలనాధికారి శశాంకతో కలిసి జమ్మికుంట, హుజురాబాద్ మండలాల్లో పర్యటించారు.
ఇళ్ల నిర్మాణాల తీరును మంత్రి స్వయంగా వీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో, రోడ్డు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇల్లందుకుంట మండలం పాతర్లపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈటల సూచించారు.