కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ ఛైర్మన్ కనుమల్ల విజయ సందర్శించారు. ఆలయంలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రిని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.