రాష్ట్ర ప్రభుత్వం మాడ్రన్ టెంపుల్స్ అంటే కళాశాలలను చూపెడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రూ. 5.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలను ఆయనతో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా ఛైర్మన్ రామక్రిష్ణారావులు కలిసి ప్రారంభించారు.
విద్యాలయం జ్ఞానాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు. వేరే దేశాలకు వెళ్లి చదివే సంస్కారాన్ని ఇస్తుందన్నారు. కళాశాలల్లో చదివే విద్యార్థులు మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. మనిషి ప్రవర్తన కళాశాల నుంచే మొదలవుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రులే కాకుండా తాము కూడా ఆలోచిస్తామన్నారు.
ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!