ప్రజలకు మెరుగైన పాలనను అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరుపేద ప్రజలకు ఉపాధి కల్పనా మార్గాలను చూపాలన్నారు. తక్కువ డబ్బుతో మెరుగైన వసతులను కల్పించి ఉపాధి చూపేందుకు కృషి చేయాలన్నారు.
జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దాలంటే కోట్లాది రూపాయలు అవసరం లేదన్నారు. ఉన్న డబ్బుతో మెరుగైన పట్టణంగా తీర్చిదిద్దవచ్చన్నారు. మురుగు కాలువలు, వీధి దీపాల నిర్వహణ, రహదారుల శుభ్రత వంటి వాటిపై ఎప్పటికప్పుడు దృష్టిపెట్టాలని చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, పాలనాధికారి కె.శశాంక పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎన్ని తాయిలాలిచ్చినా.. తెరాస పాపాలు తెరమరుగు కావు'