కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జమ్మికుంట మండలం నాగంపేటలో జరిగిన బీరన్న బోనాల జాతరలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. బీరన్న స్వామిని దర్శించుకున్న మంత్రి ఆలయానికి ప్రహరీ గోడను నిర్మించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమలాపూర్ మండలం శనిగరంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవీ చూడండి: ఇందూరు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు