కరీంనగర్ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుపడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగర అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేపడుతోందని పేర్కొన్నారు.
తొలివిడతగా రూ.100 కోట్లు..
బడ్జెట్‌లో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి రూ.100 కోట్ల కేటాయించినందుకు తెలంగాణా చౌక్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దాదాపు రూ.500 కోట్లతో నిర్మించపోయే రివర్ ఫ్రంట్‌కు తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయించారని అన్నారు.
5 చెక్‌డ్యాములు..
అంతర్జాతీయ సంస్థతో నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దిగువమానేరు నుంచి ఇప్పటికే 10 కిలోమీటర్ల వరకు నీటి నిల్వ చేసేందుకు రూ.80 కోట్లతో 5 చెక్‌డ్యాములు నిర్మిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ సైకిల్.. గంట ఛార్జింగ్‌తో 20కి.మీ!