అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. తెరాస సభ్యత్వం నమోదు చేసుకొని పార్టీ బలోపేతానికి పాటుపడాలని అభిమానులను కోరారు.
కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. కట్ట రాంపూర్‌లోని 11వ డివిజన్లో కార్పొరేటర్ నర్మదా నర్సయ్యతో కలిసి నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలు తెరాసకు అండగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్