కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మైదానాల్లో వ్యాయామశాలలతోపాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పాదచారులతో కలిసి పర్యటించారు. నగరంలోని మైదానాల్లో రూ.1కోటి కేటాయించి ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
కళాశాల మైదానంలో పాదచారులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని... ప్రజలు ఓపెన్ జిమ్‌లను పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల పాదచారుల అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: బ్యాంకు కొల్లగొట్టేందుకు విఫలయత్నం.. సీసీలో దృశ్యాలు