ETV Bharat / state

స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ...కల్యాణం కానిచ్చేశారు

దేశం వ్యాప్తంగా లాక్​డౌన్ నేపథ్యంలో అనేక శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఇటీవల సర్కారు లాక్​డౌన్ సడలింపులు ఇవ్వడం వల్ల అక్కడక్కడ ప్రభుత్వ అధికారుల అనుమతితో వివాహాలు జరుగుతున్నాయి. ఓ జంట ఈరోజు మంథనిలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ... వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

karmingar District latest news
karmingar District latest news
author img

By

Published : May 13, 2020, 4:31 PM IST

కరీంనగర్​కు చెందిన శ్రీకాంత్​కు మంథనికి చెందిన తేజస్వినికి గత రెండు నెలల క్రితం వివాహ నిశ్చయం జరిగింది. ​సర్కారు లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు మంథనిలోని వధువు ఇంటి పరిసరాల్లోనే తక్కువ మంది బంధు వర్గంతో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజర్​లను ఏర్పాటు చేసుకొని సామాన్యంగా వివాహం జరిపించారు.

వివాహానికి వచ్చిన చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి అందరికీ స్వీయ రక్షణ ఎంత అవసరమో తెలియాజేశారు. వివాహానికి విచ్చేసిన ఆ కొద్ది మంది మళ్లీ పాత రోజులు వచ్చాయని... ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఆ కాలంలో జరిగిన వారి పెళ్లిళ్ల గురించి ముచ్చటించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.