ETV Bharat / state

మన్నెంపల్లి కాలువకు గండి... ఇళ్లల్లోకి కాళేశ్వరం జలాలు

రబీ సీజన్​ కోసం చెరువులు నింపేందుకు కాళేశ్వరం జలాలను తరలిస్తుండగా.... మన్నెంపల్లి కాలువకు గండిపడింది. వరద ఉద్ధృతికి కాళేశ్వరం జలాలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి చేరుతున్నాయి.

author img

By

Published : Feb 24, 2020, 12:05 AM IST

MANNEMPALLI CANAL BROKE OUT KALESWARAM WATER INTO HOUSES

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి వరద కాలువకు గండి పడి... కాళేశ్వరం జలాలు ఇళ్లలోకి ప్రవేశించాయి. రబీ సీజన్​ కోసం సిద్దిపేట జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ నుంచి అధికారులు వరద నీటిని తరలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల మీదుగా మానకొండూరు మండలానికి ఈ జలాలు చేరనున్నాయి.

మన్నెంపల్లి చెరువులు నిండగా... మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లికి నీటిని తరిలించే క్రమంలో వరద కాలువకు గండి పడింది. వరద ఉద్ధృతికి నీళ్లు నివాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, విలువైన సామాగ్రి జలమయమయ్యాయి. అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మన్నెంపల్లి కాలువకు గండి... ఇళ్లల్లోకి కాళేశ్వరం జలాలు

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.