కరీంనగర్ దిగువమానేరు జలాశయం ఈసారి ప్రపంచ ప్రఖ్యాత లేజర్ షోకు వేదిక కాబోతోంది. ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన లేజర్ టెక్ సంస్థ ద్వారా షో నిర్వహించబోతున్నారు. దిగువమానేరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ షోను సన్నాహక షోగా భావిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
జలాశయం బండ్‌కు దాదాపు 300మీటర్ల దూరంలో నీటి మధ్యలో ప్రదర్శించబోతున్న లేజర్‌షోకు సంబంధించిన స్థలాన్ని మంత్రి గంగుల పోలీస్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థలపరిశీలన,లేజర్‌షో ప్రత్యేకతను ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
ఇవీ చూడండి: వరుణాగ్రహం... చారిత్రక గోల్కొండ కోట గోడ నేలమట్టం