కరీంనగర్ జిల్లా ముంజంపల్లిలో రైస్ మిల్లులో విద్యుత్ నియంత్రికకు రంగులు వేస్తుండగా... విద్యుదాఘాతానకి గురై ఓ వ్యక్తి మరణించారు. గ్రామ శివారులో మూతపడ్డ రైసు మిల్లు మరమ్మతులో భాగంగా... విద్యుత్ నియంత్రికకు రంగులు వేస్తున్నారు. లక్ష్మీపూర్‌కు చెందిన ఈర్ల వెంకటేశ్వర్లు విద్యుత్ షాక్‌కు గురైన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు మిల్లు యాజమాన్యం, అధికారులతో వాగ్వాదానికి దిగారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి : 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!