ETV Bharat / state

పెట్టుబడి అంతా వరదార్పణం... లక్ష ఎకరాలకు సాయమందేనా..!

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు అన్నదాతల్ని కంటతడి పెట్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. పొలాల్లో ఇసుక, బురద మట్టి.. మేటలు వేసింది. అధికారులు చెబుతున్నట్లుగా లక్ష ఎకరాల కన్నా ఎక్కువగా పంటలు నీట మునిగాయని రైతు సంఘాలు వాపోతున్నాయి.

major-crop-loss-in-telangana-due-to-heavy-rains
పెట్టుబడి అంతా వరదార్పణం
author img

By

Published : Aug 2, 2021, 10:38 AM IST

కుండపోతగా కురిసిన అతి భారీ వర్షాలు రైతులకు అంతులేని ఆవేదన మిగిల్చాయి. పలు గ్రామాల్లో వర్షపునీరు వరదలా పారడంతో పైర్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక, బురద మట్టి మేటలు వేసింది. వ్యవసాయాధికారులు పైపైన చూసి వేసిన లెక్కల ప్రకారమే లక్ష ఎకరాలకు పైగా నీటమునిగినట్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ లెక్కలను పక్కనపెట్టి వర్షపు నీరంతా వెళ్లిన తరవాత మళ్లీ నష్టాలను అంచనా వేయాలని వ్యవసాయశాఖ జిల్లా వ్యవసాయాధికారుల(డీఏఓ)కు సూచించింది. ఒక కమతంలో 33 శాతానికి పైగా పంట నాశనమైతేనే రైతు నష్టపోయినట్లు గుర్తించి ప్రాథమిక వివరాలు పంపాలంది.

వర్షపు నీరంతా వెళ్లిపోతే పంటనష్టం అంతగా కనిపించదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు చెబుతున్నట్లుగా లక్ష ఎకరాల కన్నా ఎక్కువగా పంటలు నీట మునిగినట్లు రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఒక్క కుమురం భీం జిల్లాలోనే 46 వేల ఎకరాల పైర్లు నీట మునిగాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 26,547 ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పసుపు, మామిడి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు 3500 ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు రూ.2.50 కోట్ల విలువైన పంటలను కోల్పోయినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పసుపు పంట బాగా దెబ్బతింది. కరీంనగర్​లో వరి నేలకొరిగి.. దెబ్బతింది.

నష్టానికి పరిహారం ఇలా రావాలి

విపత్తులతో పంటలు నష్టపోతే రైతులను ఎలా ఆదుకోవాలో 2015 జూన్‌ 15న రాష్ట్ర విపత్తు శాఖ.. వ్యవసాయశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతు ఏ కమతంలో ఎంత పంట నష్టపోయారనే వివరాలను వ్యవసాయశాఖ పంపితేనే ఈ నిధి నుంచి సాయం చేస్తామని రాష్ట్ర విపత్తు శాఖ చెబుతోంది. హెక్టారు విస్తీర్ణంలో అరటి తోట దెబ్బతింటే రూ.24 వేలు, మొక్కజొన్న పాడైతే రూ.8,333, ఇతర పంటలు దెబ్బతింటే రూ.13,500 పరిహారంగా ఇవ్వాలి. గేదె, ఆవు మరణిస్తే రూ.30 వేలు, గొర్రె..మేక అయితే రూ.3 వేలు ఇవ్వాలి.

ఇక్కడ పత్తి పంట ఉండేది

వర్షాలకు ముందు ఇక్కడ పత్తిచేను కనిపించేది. ఒకేరోజు 39 సెంటీమీటర్ల భారీ వర్షం పడటంతో ఇక్కడున్న పైరు కొట్టుకుపోయి ఇలా మారింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో వేసిన పంట నాశనమైంది. 15 ఎకరాల్లో పంట వేసి.. రూ.లక్షా 30 వేలు పెట్టుబడి పెట్టానని రైతు కొట్రంగి పాండు ఆందోళన చెందారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

- కె.పాండు

వర్షాలకు జరిగిన నష్టం విలువ రూ.21 లక్షలు ఉంటుందని, ఈ లెక్కలన్నీ గ్రామాల వారీగా సేకరిస్తున్నామని పశుసంవర్థకశాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ లక్ష్మారెడ్డి తెలిపారు. బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: Nagarjuna Sagar Dam: 22క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.