సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందించిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామస్థులు మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. చిన్నారులను చిదిమేస్తున్న కీచకులను గుర్తించిన వెంటనే పోలీసులకు పట్టిస్తామని ప్రతిజ్ఞ పూనారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు. రామడుగు ఎస్ఐ రవి ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
- ఇదీ చూడండి : 'రంగంలో భవిష్యవాణి ఏం చెప్పిందంటే..'