కరీంనగర్లో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. కరీంనగర్ పాతబజార్లోని శివాలయంలో శంకరున్ని భక్తిశ్రద్ధలతో పూజించారు. లింగాన్ని అభిషేకించి బిల్వ పత్రాలను సమర్పించారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు