కరీంనగర్ - సిరిసిల్ల, వేములవాడ రహదారి విస్తరణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ నిర్మాణంలో మాత్రం ఎనలేని నిర్లక్ష్యం తాండవం చేస్తోంది. ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా... రహదారి నిర్మాణం మాత్రం ఎవరికీ పట్టడం లేదు. రహదారిపై గోతులు భారీగా ఉండటం వల్ల కేవలం కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే... దాదాపు అరగంట సమయం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనాల రద్దీ కారణంగా దుమ్ము ధూళి వస్తుండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రామస్థులు వాపోయారు. అత్యధికంగా గ్రానైట్ క్వారీలు ఉన్న ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వానికి ఆదాయం కూడా విపరీతంగా సమకూరుతోంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 85 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ... పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది.
ఇవీ చూడండి:కట్టు తప్పితే తప్పదిక భారీ మూల్యం...