ETV Bharat / state

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ విద్యార్థులు.. బండి సంజయ్​కు ఫోన్​ - ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Telangana Students in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​కు చెందిన విద్యార్థులు సాయం కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్​ చేశారు. ప్రస్తుతం 20 మంది ఎయిర్​పోర్ట్​లో చిక్కుకున్నట్లు సంజయ్​కు వివరించారు. స్పందించిన సంజయ్​ వెంటనే విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులను భారత్​కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

bandi sanjay
bandi sanjay
author img

By

Published : Feb 24, 2022, 3:31 PM IST

Updated : Feb 24, 2022, 10:30 PM IST

Telangana Students in Ukraine: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ ఎయిర్​పోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. భారత్​ వచ్చేందుకు విమానం టికెట్టు బుక్​ చేసుకున్న వారంతా ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అయితే అంతలోనే యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్​ తన గగన తలాన్ని మూసివేసింది. గగన తలాన్ని డేంజర్ ​జోన్​గా ప్రకటించింది. ఎయిర్​పోర్టు నుంచి బయటకు వెళ్లే దారులను మూసివేసింది. దీంతో విద్యార్థులంతా ఎయిర్​పోర్టులోనే ఉండిపోయారు. ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుతున్నారు.

భారత్​కు రాలేక.. తిరిగి యూనివర్సిటీకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు.. కరీంనగర్​కు చెందిన విద్యార్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్​ చేశారు. తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీ సంజయ్​.. వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించాలని విన్నవించారు.

భాజపా రాష్ట్ర కార్యాలయంలో టోల్​ ఫ్రీ నంబర్​..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల వివరాలు సేకరించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్​ ఫ్రీ నంబర్ - 8333871818 ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉక్రెయిన్​లో చిక్కుకున్నవారు.. ఈ నంబర్​కు కాల్​ చేసి చెబితే.. విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులను సంప్రదించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవీచూడండి:

Last Updated : Feb 24, 2022, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.