Karimnagar Smart City Works : రాష్ట్రంలో సర్కారు మారడంతో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న పనుల నాణ్యతపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. తాజాగా హౌజింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన పనుల్లో నాణ్యత కొరవడిందని ఫిర్యాదులు వెలువెత్తడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు స్మార్ట్‌సిటీ పనుల్లో నిబంధనలను తుంగలో తొక్కారని నాణ్యత గురించి పట్టించుకోలేదని ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు కరీంనగర్ మాజీమేయర్ స్పష్టం చేశారు.
స్మార్ట్ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్
Quality Less Smart City Works In Karimnagar : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో స్మార్ట్ సిటీ పనులు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నారు. 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి. మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉండగా కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నగరవ్యాప్తంగా మూడు ప్యాకేజీలలో 52 ప్రాజెక్టులను తీసుకొని 936.94 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రధానంగా రహదారులు, మురుగు, వరదనీటి కాల్వలు, పార్కులు, తాగునీటి సరఫరా, కమాండ్ కంట్రోల్, ఫుట్‌పాత్, పచ్చదనం, లైటింగ్స్, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, సిగ్నలింగ్ వంటివి ఉన్నాయి. ప్యాకేజీ-3లో 64.84 కోట్ల నిధులు హౌసింగ్ బోర్డు కాలనీకి కేటాయించారు. ఆ నిధులతో రోడ్లు, మురుగునీటి కాల్వల పనులు పూర్తి చేశారు.
నేటి నుంచి అందుబాటులోకి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి
'' గత 2సంవత్సరాల క్రితం వేసిన రహదారుల టైల్స్ ఊడి పోతున్నాయి. నాసిరకం ఇసుక వాడటం వల్ల రోడ్లు అన్నీ పగుళ్లు తేలాయి. కమీషన్ల కోసం వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్డు వేశారు. స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం జరిగాయి. స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న పనుల నాణ్యతపై గతంలో అనేక ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులు పారదర్శకంగా తనిఖీలు చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.'' - రవీందర్ సింగ్ , మాజీ మేయర్
Delay In Karimnagar Smart city Works : ఇక్కడ జరుగుతున్న పనులపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో రహదారులు, మురుగు కాలువలు తప్ప మిగతా పనులు నిబంధనల ప్రకారం చేపట్టలేదనే ఆరోపణలు వెలువెత్తాయి. కాలనీని అందంగా తీర్చిదిద్దాల్సి ఉండగా మొక్కుబడి పనులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో చేపట్టిన పనుల దస్త్రాలను కూడా అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విభాగంలోని ఇంజినీర్లతో లోతుగా పరిశీలించనున్నారు.
ఆ తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అవకాశముంది. నగరంలో స్మార్ట్ పనులపై విజిలెన్స్‌తో పాటు ఇతర శాఖలకు వేర్వేరుగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. స్మార్ట్ సిటీ పనుల్లో నిబంధనలు పాటించలేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరోసారి బోర్డుమెంబర్ల తీరుపై మండిపడ్డారు. పనుల్లో నాణ్యత లేదని నాసిరకం ఇసుక వాడటం వల్లే కంకర లేస్తోందని, పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలి: మంత్రి గంగుల
'వరంగల్ స్మార్ట్‌సిటీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి'