ETV Bharat / state

'జేబు దొంగలున్నారు జాగ్రత్త'.. బోర్డులు తీసేశారు.. కానీ!

author img

By

Published : Dec 26, 2020, 8:05 AM IST

జేబు దొంగలున్నారు జాగ్రత్త... ఇలాంటి బోర్డులను అనేక రద్దీ ప్రాంతాల్లో చూస్తుంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్న కొందరు కేటుగాళ్లు... తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి వాటిని అరికట్టాలని కరీంనగర్‌ పోలీసులు భావించారు. ఎక్కువగా దొంగతనాలు జరిగే కరీంనగర్‌ బస్టాండ్‌లో తమ ఆలోచనను అమలు చేసి... నేరాలకు అడ్డుకట్ట వేశారు.

బస్టాండులో దొంగతనాలను ఇలా అడ్డుకున్నారు
బస్టాండులో దొంగతనాలను ఇలా అడ్డుకున్నారు
బస్టాండులో దొంగతనాలను ఇలా అడ్డుకున్నారు

కరీంనగర్‌ బస్టాండ్‌ నిత్యం వందల మందితో రద్దీగా ఉంటోంది. వివిధ జిల్లాలతోపాటు... గ్రామాలకు చెందిన ప్రయాణికులు జిల్లా కేంద్రానికి వస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అనేక దొంగతనాలు జరుగుతుండేవి. కొందరు బస్సుల్లోకి ఎక్కి బ్యాగులు, వస్తువులు అపహరించేవారు. బస్టాండ్‌లో ఎక్కడపడితే అక్కడ జేబుదొంగలున్నారు జాగ్రత్త అనే హెచ్చరికలు దర్శనమిస్తుండేవి కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. నేరాల నియంత్రణకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఫలించిన ప్రయత్నాలు

గతంలో పదిరోజుల వ్యవధిలో దాదాపు 7 నేరాలు జరిగాయి. వీటిని అరికట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పోలీసులు భావించారు. వ్యాపారస్తుల సహకారంతో బస్టాండ్‌లోని దాదాపు 75 ఫ్లాట్‌ఫాంలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దుకాణాల్లోనూ 4 నుంచి 5 కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరీంనగర్ బస్టాండ్ పూర్తిగా సురక్షితంగా మారిందని... అధికారులు, దుకాణదారులు చెబుతున్నారు.

నిఘానేత్రాలతో అడ్డుకట్ట

నేరస్థులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వరస ఘటన నేపథ్యంలో బస్టాండ్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో హుజురాబాద్‌, జమ్మికుంట బస్టాండ్లలోనూ కెమెరాలు ఏర్పాటుచేసి నేరాలను పూర్తిగా నియంత్రించామని వివరించారు.

నిఘానేత్రాల ఏర్పాటుతో తగ్గిపోయిన నేరాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వీధులు, ఇళ్లలోనూ సీసీ కెమెరాలు బిగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: జగిత్యాల యాసిడ్ దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.