కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శశాంక.. అధికారులతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు.
జిల్లాలో వరిధాన్యం సేకరణ, పత్తి కొనుగోళ్లు, రంజాన్ పండుగ దుస్తుల పంపిణీ, వన్స్టాఫ్ సెంటర్ పనితీరుపై కలెక్టర్ శశాంక ఆరా తీశారు. అధికారులు ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు.. తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల సమగ్ర నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని శశాంక ఆదేశించారు.
- ఇదీ చూడండి : ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు