కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. కరీంనగర్ నగర పాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా.. అన్ని డివిజన్లలో ప్రత్యేక అధికారులను నియమించి ఆస్తుల నమోదును వేగవంతం చేశారు.
నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు తమ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయించుకున్నారు. ప్రజలందరూ తమ ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు