కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్‌ను నగర మేయర్ వై.సునీల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నగరపాలక సంస్థ మొదటి సంవత్సరం ప్రగతి నివేదిక పుస్తకాన్ని ఆయనకు అందించారు. బి.వినోద్ కుమార్... మేయర్ సునీల్ రావుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నగరపాలక సంస్థ అభివృద్ధిపై పాలకవర్గం కృషి చేస్తున్న తీరును అభినందించారు.
ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ... కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతి, డివిజన్ కార్పొరేటర్లు, కో- ఆప్షన్ సభ్యులను వినోద్‌కుమార్ అభినందించారు. మేయర్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఇదే స్ఫూర్తి, ఐక్యతతో పనిచేసి ప్రజలకు సేవలందించాలని సూచించారు.
ఇవీ చదవండి: కార్పొరేట్‌ను తలదన్నేలా.. ప్రభుత్వ విద్య: మంత్రి కేటీఆర్