సీజనల్ వ్యాధులపై నగర ప్రజల్లో చాలా అవగాహాన వచ్చిందని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్ వెల్లడించారు. ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 33వ డివిజన్లో ఆయన పర్యటించారు.
పలు నివాసగృహాలు సంద్శించి... పూల కుండీలు, వాడని ఖాళీ డబ్బాల్లో నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణ అంశాలపై ఇంటి యజమానులకు అవగాహాన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కుంటుంబ సభ్యులు, చుట్టు పక్కల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'