ETV Bharat / state

శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్​, మేయర్​ - కరీంనగర్​ జిల్లా కలెక్టర్​

కరీంనగర్​ జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మేయర్​ సునీల్​ రావు అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్​ శశాంక, కమిషనర్​ క్రాంతితో కలిసి ఆయన శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటారు.

Karimnagar mayor participated in harithaharam in shatavahana university
శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్​, మేయర్​
author img

By

Published : Jul 7, 2020, 2:32 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరీంనగర్​ నగర పాలక సంస్థ పరిధిలో విజయవంతంగా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేయర్​ సునీల్​ రావు అన్నారు. హరితహారంలో భాగంగా శాతవాహన విశ్వ విద్యాలయంలో కలెక్టర్​ శశాంక, కమిషనర్​ క్రాంతితో కలిసి ఆయన మొక్కలు నాటారు.

ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే.. అక్కడ్ మొక్కలు నాటాలని నగరపాలక సిబ్బందికి సూచించామని, నాటిన మొక్కలు సంరక్షిస్తూ హరిత కరీంనగర్​గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మేయర్​ తెలిపారు. శ్రద్ధగా హరితహారం నిర్వహిస్తూ.. మొక్కలను సంరక్షించే చర్యలు తీసుకుంటున్న మేయర్​ కృషిని కలెక్టర్​ శశాంక ప్రశంసించారు. మొక్కలు నాటడమే కాదు..వాటిని సంరక్షించినప్పుడే మన బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్టు అని కలెక్టర్​ అన్నారు.

ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.