ఐటీ టవర్‌ను కరీంనగర్లో ఈనెల 18న ఉదయం 10గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలోనే దీని ప్రారంభోత్సవం కొంచెం ఆలస్యమైనట్టు చెప్పారు. మొత్తం 12 కంపెనీలతో ఎంవోయూలు చేసుకొని ప్రారంభించాలని అనుకున్నామనీ తెలిపారు. కానీ ఇప్పటిదాకా 18 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తమను సంప్రదించాయని మంత్రి వివరించారు.
ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చామనీ.. అందుకే అనేక ప్రాంతీయ కంపెనీలతో పాటు బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. కరీంనగర్‌కు సంబంధించిన 80శాతం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
ఇవీ చూడండి : 'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'