అభ్యర్థులు సాదాసీదాగా, పరిమిత సంఖ్యలో మద్దతుదారులతో వచ్చి నామ పత్రాలు దాఖలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని శశాంక స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం