కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు, దుద్దెనపల్లి, గొడిశాల గ్రామాల్లో కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదిక భవనాల పనుల పురోగతిని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ సర్వేను అధికారులు ఏ విధంగా చేపడుతున్నారో స్వయంగా పలు ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. సర్వేకు ప్రజల సహకారం ఎలా ఉందని, ఏఏ విషయాలను వారి నుంచి తెలుసుకుంటున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఏ ఏ గ్రామాలు, వార్డులకు వెళ్తున్నారో ఆ స్థానికులకు ఒకరోజు ముందుగా సమాచారం అందివ్వాలని తెలిపారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారబూడ్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి, ఎమ్మార్వో సదానందం, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.