కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో సీఎం దత్తత గ్రామమైన చిన్నముల్కనూరులో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శశాంక, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను ఎమ్మెల్యే, కలెక్టర్లు పూడ్చివేశారు. చెత్తాచెదారం నిల్వ లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు కలెక్టర్ శశాంక సూచించారు. రహదారులపై ఏర్పడ్డ ప్రమాదకర గుంతను పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- ఇవీ చూడండి: రెండో విడత 'పట్టణ ప్రగతి' ప్రారంభం