పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసప్రజలను అయోమయానికి గురి చేస్తోందని కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కరీంనగర్ గడ్డపై కాషాయ పతాకం ఎగరడం కాయమని ఆకాంక్షించారు. ఆయన వెంట భాజపా సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.
ఇవీ చూడండి:నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు