కరీంనగర్ జిల్లా కొండపలకల జడ్పీహెచ్ పాఠశాలలో తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికలకు కరాటే శిక్షణను ఏర్పాటు చేశారు. సీఐ సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందన్నారు.
పాఠశాల స్థాయి నుంచే బాలికలు తమదైన శైలిలో తమను మలుచుకుంటూ ధైర్య సాహసాలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మందల రాజిరెడ్డి, జిల్లా తైక్వాండో కార్యదర్శి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్