కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం భవన నిర్మాణంలో భాగంగా మొదటి అంతస్తులో లైబ్రరీ నిర్మాణానికి.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం శంకుస్థాపన చేశారు. న్యాయవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కొవిడ్-19 సమయంలో జిల్లాలోని న్యాయవాదులు చేసిన సేవలను న్యాయమూర్తి కొనియాడారు. ఇదే స్ఫూర్తితో కొనసాగాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష