సియాసత్ ఉర్దూ పత్రికలో పనిచేసిన పాత్రికేయుడు సయ్యద్ మొహిద్దీన్ మృతి పట్ల మేయర్ సునీల్‌రావు విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ఉర్దూభవన్లో ముస్లి ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
సయ్యద్ మొహిద్దీన్ అకాల మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. నైతిక విలువలను పాటిస్తూ పత్రిక ధర్మాన్ని కాపాడారని అన్నారు. మీడియా రంగంలో నిబద్ధతతో పనిచేసి గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు.