ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తో పాటు పట్టభద్రుల స్థానంలోనూతెరాసకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ విజయం ప్రారంభమైందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయని అన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు తనను గెలిపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు అవసరమని నిరూపించారని చెప్పారు. జీవన్ రెడ్డి గెలుపొందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేశ్రీధర్ బాబుతో పాటు కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి:ఖమ్మం బరిలో 29 మంది, 5 నామినేషన్ల తిరస్కరణ