కరీంనగర్‌లోని కిసాన్ నగర్‌లో... కరోనా సాకుతో కన్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఘటనపై... న్యాయ సేవాధికార సంస్థతో పాటు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. మే 29న షోలాపూర్ నుంచి వచ్చిన కట్ట శ్యామలను అడ్డుకోవటంపై స్పందించిన హైకోర్టు.... విచారణ జరపాలని జిల్లా న్యాయమూర్తిని ఆదేశించింది.
అధికారులు విచారణ చేయగా.... కొడుకు, కోడలు ఇంట్లోకి రానివ్వకపోయినా... తన గదిలో తాను ఉంటున్నానని ఆమె తెలిపింది. మరోవైపు కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు... శ్యామలకు ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించారు. తల్లికి ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా... ఇద్దరు కొడుకుల నుంచి కొంత మెుత్తాన్ని అందించేలా ఆదేశించినట్లు ఆర్డీవో ఆనంద్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్: 'కాలాపానీ'పై రగడ ఏల?